తాండూరు బల్దియాకు ఉత్తమ అవార్డులు..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు బల్దియాకు ఉత్తమ అవార్డులు..!
– అందుకున్న మేనేజర్ నరేందర్ రెడ్డి, ఎఈ ఖాజా
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని తాండూరు మున్సిపల్‌కు ఉత్తమ అవార్డులు వరించాయి. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఇద్దరు అధికారులు ఈ ఉత్తమ అవార్డులను అందుకున్నారు. మున్సిపల్‌లో మేనేజర్‌గా నరేందర్ రెడ్డి, డీఈగా ఖాజా లు విధులు నిర్వహిస్తున్నారు. విధులను సక్రమంగా నిర్వహించడంతో పాటు ప్రజలకు సేవలందించడం పట్ల వారిని ఉత్తమ అధికారులకు ఎంపిక చేశారు. ఈ మేరకు శుక్రవారం వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో జరిగిన సామూహిక 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ మేనేజర్‌గా నరేందర్ రెడ్డి, ఉత్తమ డీఈ ఖాజాలు అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిని అభినందించి శుభాకంక్షలు తెలిపారు.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!