బాధితులకు న్యాయం అందేలా కృషి
– సమైఖ్య హుమన్ రైట్ కౌన్సిల్ సభ్యులు
– జిల్లా ప్రధాన కార్యదర్శిగా నరేందర్
– మండల అధ్యక్షులుగా ఎస్.ప్రవీణ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : వివిధ సమస్యల్లో, వేధింపుల్లో బాధితులకు న్యాయం అందేలా కృషి చేస్తామని సమైఖ్య హుమన్ రైట్స్ కౌన్సిల్ (ఎస్ హెచ్ఎర్సీ) సభ్యులు అన్నారు. శంకర్ పల్లిలోని సమైఖ్య హుమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ కార్యాలయంలో ఎన్హెన్ఆర్సీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బి. నరేందర్, తాండూరు మండల అధ్యక్షులుగా ఎస్.ప్రవీణ్ కుమార్, మండల ఈసీ మెంబర్ గా ఆర్. సునీల్ కుమార్, మండల మహిళ ప్రధాన కార్యదర్శిగా ఎస్. అర్చనలను ఎన్నుకుని నియామకపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థిక, మానసిక, లైంగిక, వరకట్నం, అవినీతి, గృహ నిర్భందం, భూకబ్జాలు, అంటరాని తనం, భ్రూణ హత్యలు తదితర విషయాలలో బాధితులకు న్యాయం జరిగేలా ఎసెన్ఆర్సీ తరుపున కృషి చేస్తామన్నారు. ఎసెహెచ్ఆర్సీ జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటి పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా పనిచేస్తామన్నారు. పదవులు అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
ఇదికూడా చదవండి…

