ఎమ్మెల్సీ, మాజీ ఎంపీలను కలిసిన రవీందర్ గౌడ్
– సన్మానించి.. ఆశీస్సులు పొందిన డీసీసీబీ వైస్ చైర్మన్
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, చేవేళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డిలను డీసీసీబీ వైస్ చైర్మన్ సంగెం రవీందర్ గౌడ్ కలిశారు. సోమవారం ఉమ్మడి జిల్లా డీసీసీబీ వైస్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా రవీందర్ గౌడ్ హైదరాబాద్ లో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డిలను మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ, మాజీ ఎంపీలను శాలువాతో సత్కరించి.. పుష్పగుచ్చాలను అందజేశారు.
అనంతరం వారి ఆశీస్సులను తీసుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డిలు రవీందర్ గౌడ్ డీసీసీబీ వైస్ చైర్మన్ ” గా ఎన్నికైన సందర్భంగా స్వీట్లు తినిపించి శుభకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, నేతలు అబ్దుల్ రవూఫ్, కొమ్ము గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, శ్యామప్ప, మాజీ సర్పంచులు లాల్ రెడ్డి, మేఘనాథ్ గౌడ్, మనోజ్ గౌడ్, మార్కెట్ కమిటి డైరెక్టర్ అజ్మత్ అలీ, మైనార్టీ నాయకులు మసూద్ తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

