బీఆర్ఎస్ కు బిగ్ షాక్..?

తాండూరు తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

బీఆర్ఎస్ కు బిగ్ షాక్..?
– సీఎం రేవంత్ ను కలిసిన పట్నం ఫ్యామిలీ
– చర్చనీయాంశమైన పరిణామం
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఎన్నాళ్ళో జిల్లా ప్రజలు, పట్నం అభిమానులు ఎదురు చూసిన శుభపరిణామం రానే వచ్చింది. గురువారం సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆయన నివాసంలో ‘పట్నం’ ఫ్యామిలీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ , మాజీ మంత్రి పట్నం మహేంధర్ రెడ్డి, హ్యాట్రిక్ జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి, యువ నాయకుడు పట్నం రినీష్ రెడ్డి కలిసి చర్చించారు. ఈ సందర్భంగా చేవెళ్ల ఎంపీగా సునీతారెడ్డి గారు పోటీచేయాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించింది. ఈ నెల 11లోపు పార్టీ లో చేరే అవకాశం ఉంది. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహ తదితరులు ఉన్నారు.

 

ఇదికూడా చదవండి….

 

సార్లు వస్తున్నారు..!