జీటీఏటీఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

జీటీఏటీఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ..!
– ఎమ్మార్సీ కార్యాలయంలో కార్యక్రమం
– పాల్గొన్న అధికారులు, ఉపాధ్యాయులు 
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉపాద్యాయ సంఘం (జీటీఏటీఎస్) క్యాలెండర్, డైరీలను శనివారం ఆవిష్కరించారు. తాండూరు మండల విద్యావనరుల కేంద్రం(ఎమ్మార్సీ)లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తాండూరు తహసీల్దార్ తారసింగ్, ఎంపిడిఓ సుదర్శన్ రెడ్డి, ఎంపీఓ రతన్ సింగ్, తాండూరు మండల విద్యాధికారి వెంకటయ్యగౌడ్‌లు హాజరై క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల జీహెచ్ఎంలు సత్యనారాయణ, ఇందుప్రియ జీటీఏటీఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పెరుమాళ్ల నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి మహేష్, కోశాధికారి సుధీర్, తాండూర్ మండల అధ్యక్షులు వెంకట్ రాములు, ప్రధాకార్యదర్శి శ్రీనివాస్, వికారాబాద్ జిల్లా మహిళ అధ్యక్షురాలు ఆరాధన, ప్రధాకార్యదర్శి నళిని కార్యవర్గ సభ్యులు, కరుణామయుడు, నరేందర్, ఈశ్వర్, సంతోష్, రామకృష్ణ, అంజయ్య, ప్రభులింగం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!