బీసీలపై కపట ప్రేమను నమ్మలేం..!
– పూలే విగ్రహంపై కవితమ్మ సానుభూతి విడ్డూరం
– రేపటి దర్నాను బహిష్కరిస్తున్నాం
– బీసీ సంఘం జా. కార్యవర్గ సభ్యులు కె. రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్సీ కవిత చూపిస్తున్న కపట ప్రేమను ఎవ్వరు నమ్మే స్థితిలో లేరని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. అసెంబ్లీలో పూలే విగ్రహ ఏర్పాటు కోసం దర్నా చౌక్ వద్ద ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చిన దర్నాను బీసీ సంఘం బహిష్కరిస్తుందని ఆదివారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 9 ఏండ్లు పాలించిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు బీసీలపై చూపిస్తున్న ప్రేమ ఆశ్చర్యానికి గురిచేస్తుందన్నారు. ఇన్నాళ్లు పూలే విగ్రహా ఏర్పాటు ఆలచోన ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించలేదు కాని ఇప్పుడు బీసీలపై ప్రేమ చూపిస్తే నమ్మె స్థితిలో ఎవ్వరు లేరన్నారు. ప్రజాస్వామ్యంలో గళాన్ని వినిపించేందుకు వేధికగా ఉన్న దర్నా చౌక్ ను ఎత్తేసి ఇప్పుడు అదే దర్నా చౌక్ వద్ద ఎమ్మెల్సీ కవిత పూలే విగ్రహం ఏర్పాటు కోసం దర్నా చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. బీసీలపై కపట ప్రేమ చూపించే ఈ దర్నాను బీసీలందరు బహిష్కరిస్తున్నారని అన్నారు. బీసీలకు అన్యాయం జరిగితే సహించేది లేదని, అలాంటి వారికి మద్దతు ఎప్పుడు ఉండదన్నారు. ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో మా పోరాటాని సాగించుకుంటామన్నారు. హక్కులను సాధించుకుంటామని అన్నారు.
ఇదికూడా చదవండి…

