మనోహర్ రెడ్డిపై తప్పుగా మాట్లాడడం తగదు
– సునీతా రెడ్డిని విమర్శిస్తే అర్హత లేదు
– కాంగ్రెస్ మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ మక్సూద్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డిలపై తప్పుగా మాట్లాడడం తగదని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ మక్సూద్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు జెడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డి పై జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ చేసిన వాఖ్యలను ఖండించారు. మనోహర్ రెడ్డి అసెంబ్లీలో నాపరాతి, సుద్ద పరిశ్రమలను కాపాడాలనే ఉద్దేశంతో ప్రస్తావన తెచ్చారని అన్నారు. గుంటల భూమితో పాటు 1.15 ఎకరాలు, ఆపై ఉన్న యజమానులు, లీజులు పొందిన కార్మికుల పక్షాన మాట్లాడిన సంగతి రాజుగౌడ్ గుర్తించుకోవాలన్నారు.
రెండు నెలల్లోనే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీతారెడ్డిపై కూడా విమర్శలు చేయడం తగదన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేపై వాళ్లు విమర్శలు చేయలేదన్నారు. పార్టీకి రాజీనామ చేసిన తరువాతే కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ సునితారెడ్డిలను విమర్శించే హక్కు మీకు లేదని సూచించారు. ఇప్పటికైనా ఆచితూచీ వాఖ్యలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పూజారి వెంకటెష్ ఉన్నారు.
ఇది కూడా చదవండి…

