బీఆర్ఎస్ పార్టీ నుంచి మరోకరు ఔట్..!
– పార్టీకి రాజీనామ చేసిన పరిమళ రవీందర్
– జిల్లా అద్యక్షులు మెతుకు ఆనంద్ కు లేఖ
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని తాండూరు పట్టణ బీఆర్ఎస్ పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. మొన్న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వర్గంలో కొనసాగుతున్న బీఆర్ఎస్ పార్టీ పట్టణ మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ కౌన్సిలర్ పరిమళ రవీందర్ రాజీనామా చేశారు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామ చేస్తున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ జిల్లా అధ్యక్షురాలు డా.మెతుకు ఆనంద్ కు, పత్రిని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి అందజేసినట్లు తెలిపారు. వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వివరించారు. తనపై నమ్మకంతో పదవి బాధ్యతలు అప్పగించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. త్వరలో భవిష్యత్ ప్రణాళిక తెలియజేస్తానని చెప్పారు.
కాగా గతంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వర్గంలో ఉన్న పరిమళ అసెంబ్లీ ఎన్నిలకు ముందు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వర్గంలో చేరి పార్టీ పట్టణ మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని పొందారు. తాజాగా ఆమె పార్టీకి రాజీనామా చేయడం బీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
ఇదికూడా చదవండి…

