వాడ వాడ‌లా స్వాతంత్ర్య దినోత్సవ వేడుక‌లు

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

– 20 వ వార్డులో జెండా ఆవిష్క‌రించిన కోఆప్ష‌న్ స‌భ్యురాలు ఉష‌
తాండూరు, ఆగ‌స్టు 15 (ద‌ర్శిని) : తాండూరు ప‌ట్ట‌ణంలోని వాడ వాడ‌లో 75 వ స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌లు సంబ‌రంగా జ‌రుపుకున్నారు. స్వాతంత్ర్య దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని మున్సిప‌ల్ ప‌రిధి 20 వ వార్డులో నిర్వ‌హించిన వేడుక‌ల‌కు మున్సిప‌ల్ కోఆప్ష‌న్ స‌భ్యురాలు, మాజీ కౌన్సిల‌ర్ బిడ్క‌ర్ ఉశ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.


ఈ సంద‌ర్భంగా ఆమె జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. అనంత‌రం జాతీయ గీతం ఆలాపించి జెండాకు వంద‌నం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్‌వై రాష్ట్ర నాయ‌కులు బిడ్క‌ర్ రఘు, టీఆర్ఎస్‌వీ అధికార ప్ర‌తినిధి ద‌త్తాత్రేయ కాల‌నీ వాసులు పాల్గొన్నారు.