పార్లమెంట్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యం
– తాండూరు మండల అధ్యక్షులు నాగప్ప
– యూత్ కాంగ్రెస్ మండల కమిటి ఎన్నిక
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా యూత్ కాంగ్రెస్ పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ తాండూరు మండల అధ్యక్షులు జే. నాగప్ప అన్నారు. శుక్రవారం యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కె.జగదీష్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ మండల కమిటిని ప్రకటించారు. మండల ఉపాధ్యక్షులుగా ఇంద్ర, టీ.భరత్ కిషోర్, జే. హరికృష్ణ, కె.సాయిలు, గోవర్దన్, ప్రధాన కార్యదర్శులుగా మరికొందరికి అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు జే.నాగప్ప కమిటి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పురుషోత్తం. రాజశేఖర్. పలు గ్రామాల యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

