రూ. 9.36 లక్షల నగదు సీజ్..!
– పోలీసుల తనిఖీలో పట్టివేత
– వివరాలు వెల్లడించిన డీఎస్పీ బాలకృష్ణ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎన్నికల నిభందనలకు విరుద్ధంగా తరలిస్తున్న రూ. 9.36 లక్షల నగదును తాండూరు పట్టణ పోలీసులు సీజ్ చేశారు. శనివారం తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక డీఎస్పీ బాలకృష్ణ రెడ్డి వివరాలను వెల్లడించారు.
ఎన్నికల నియమావళిలో భాగంగా శనివారం పట్టణ సీఐ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో పట్టణంలోని మల్ రెడ్డి పల్లికి చెందిన జెట్టూరు బస్వరాజు ఎలాంటి ఆధారాలు లేకుండా రూ. 9.36 లక్షలు తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో వాటిని సీజ్ చేసినట్లు డీఎస్పీ బాలకృష్ణ రెడ్డి తెలిపారు. సీజ్ చేసిన నగదును జిల్లా కలెక్టర్ ట్రేజరి కార్యాలయానికి పంపించినట్లు వెల్లడించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ దృష్టిలో ఉంచుకుని ఎవరైనా రూ.50వేలకు మించి తరలించరాదని అన్నారు. అంతకు మించి తరలిస్తే ఆధారాలు కలిగి ఉండాలని సూచించారు. లేదంటే డబ్బును సీజ్ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ కాశినాథ్, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

