ఆమె ఆచూకీ చెబితే రూ.ల‌క్ష న‌జ‌రానా..!

క్రైం తాండూరు వికారాబాద్

ఆమె ఆచూకీ చెబితే రూ.ల‌క్ష న‌జ‌రానా..!
– చ‌ర్చ‌నీయాంశ‌మైన వివాహిత అదృశ్యం
– సోష‌ల్ మీడియాలో పోస్టులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ఆమె ఆచూకీ చెబితే రూ.ల‌క్ష న‌జ‌రానా ఇస్తాం. అవును మీరు చ‌దివింది ల‌క్ష‌రాల నిజం. తాండూరు ప‌ట్ట‌ణానికి చెందిన ఓ మ‌హిళ ఐదు రోజుల క్రితం అదృశ్య‌మైంది. పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా ఇంత‌వ‌ర‌కు ఆచూకీ ల‌భించ‌లేదు. దీంతో కుటుంబీకులు సోష‌ల్ మీడియాను ఆశ్ర‌యించి రూ. ల‌క్ష బహుమ‌తి ప్ర‌క‌ట‌న‌కు సిద్ద‌మ‌య్యారు. వివ‌రాల్లోకి వెళితే.. తాండూరు ప‌ట్ట‌ణం శివాజీ చౌర‌స్తా ప్రాంతానికి చెందిన స‌త్య‌మూర్తి భార్య అన్న‌పూర్ణ‌(36) ఇంట్లోనే ఉండేంది. అయితే అక‌స్మాత్తుగా ఈనెల 6న ఇంటి నుంచి వెళ్లిపోయి అదృశ్య‌మైంది. ఆ రోజు నుంచి భ‌ర్త స‌త్య‌మూర్తితో పాటు కుటుంభీకులు అన్న‌పూర్ణ ఆచూకీ కోసం గాలింపు చేప‌ట్టారు. రెండు రోజుల త‌రువాత తాండూరు ప‌ట్ట‌ణ పోలీసుల‌ను ఆశ్ర‌యించి ఫిర్యాదు కూడ చేశారు.
అయినా ఇప్ప‌టి వ‌ర‌కు ఆచూకీ ల‌భించ‌లేదు. తాజాగా కుటుంబ స‌భ్యులు అన్న‌పూర్ణ క‌న‌బ‌డితే.. ఆమె ఆచూకీ తెలిస్తే త‌మ‌ను సంప్ర‌దించాల‌ని, అన్న‌పూర్ణ గురించి తెలిపిన వారికి రూ. ల‌క్ష న‌గ‌దు బ‌హుమ‌తి అందిస్తామ‌ని సోష‌ల్ మీడీయాలో పోస్టులు పెట్టారు. వివ‌రాలు తెలిస్తే సెల్ : 9440008827, 9912240407, 8500116345ల‌కు సంప్ర‌దించాల‌ని ఫోన్ నెంబ‌ర్ల‌ను కూడ ప్ర‌క‌టించారు. ఈ వ్య‌వ‌హారం తాండూరులో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇదిలా ఉంటే ఇంటి నుంచి వెళ్లిపోయిన స‌మ‌యంలో అన్న‌పూర్ణ నోట్ రాసి వెళ్లిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. అందులో నా భ‌ర్త దేవుడు.. పిల్ల‌లు జాగ్ర‌త్త అని రాసి ఉన్న‌ట్లు తెలిసింది.