ఎన్నికలకు సిద్దంకండి..!
– అన్ని పోలింగ్ స్టేషన్లలో వసతులు
– తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికలకు అధికారులు సిద్దం కావాలని తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు అన్నారు. సోమవారం తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల సెక్టోరల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. తాండూరు సెగ్మెంట్కు సంబంధించి 26 మంది సెక్టోరల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీనివాస్ రావు అధికారుల విధుల నిర్వహణపై అవగాహన కల్పించారు.
వచ్చే నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో సెక్టోరల్ అధికారులు నిష్పక్షపాతంగా విధులను నిర్వహించాలన్నారు. నిబంధనలను పకడ్బందీగా పాటిస్తూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా దృష్టిసారించాలన్నారు. దీంతో పాటు తమ తమ పోలింగ్ స్టేషన్ లో ర్యాంపులు, తాగునీరు, విద్యుత్, ఓటర్లకు వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఏఓ లావణ్య, ఎన్నికల ఉప తహసీల్దార్ లలిత, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

