పక్కాగా వసతుల లెక్క..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పక్కాగా వసతుల లెక్క..!
– బడుల్లో వివరాలు సేకరించిన అధికారులు
– పలు తీర్మానాలతో ప్రభుత్వానికి నివేధిక
తాండూరు, దర్శిని ప్రతినిధి : సర్కారు బడుల్లో వసతుల వివరాల సేకరణ పక్కగా నిర్వహిస్తున్నామని తాండూరు మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. బడుల్లో వసతుల, సౌకర్యాల కర్యాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం తాండూరు మున్సిపల్ అధికారులు సర్కారు బడుల్లో వసతుల వివరాల సేకరణ చేపట్టారు. మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి. సీనీయర్ అసిస్టెంట్ రమేష్ లు పట్టణంలోని 27 సర్కారు బడులను సందర్శించారు. ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, టీచర్లతో కలిసి వి వరాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆరు అంశాలు తాగునీరు, విద్యుత్, బాలికల మరుగుదొడ్ల మరమ్మత్తులు, మైనర్, మేజర్ మరమ్మత్తుల వంటి వసతులపై వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్కారు బడుల్లో వసతుల వివరాల సేకరణను పక్కాగా నిర్వహిస్తున్నామన్నారు. ఆరు అంశాలతో పాటు ఇతర అవసరాలను గుర్తించి తీర్మానాలు సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రభుత్వానికి నివేధకలను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆర్పీలు కూడా పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

వాట్సాప్‌లో కొత్త ఫీచర్