క్రిస్మస్ విందుకు రండి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

క్రిస్మస్ విందుకు రండి..!
– రేపు తాండూరులో ఏర్పాటు
– హాజరుకానున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– తాండూరు క్రిస్టియన్ మైనార్టీ చైర్మన్ అంకిత్ అనురాగ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు తాండూరులో క్రైస్తవులకు ఏర్పాటు చేసిన క్రిస్మస్ విందుకు తరలిరావాలని నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ చైర్మన్ అంకిత్ అనురాగ్ కోరారు.

ప్రతి సంవత్సరం క్రిస్మస్ సందర్బంగా ప్రభుత్వం క్రైస్తవులకు క్రిస్మస్ విందు ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా రేపు తాండూరు పట్టణంలోని అంతారం రోడ్డు మార్గంలో ఉన్న మెట్రో ప్యాలెస్‌లో సాయంత్రం 5 గంటలకు విందు జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు అవుతారని తెలిపారు. కావున కార్యక్రమానికి క్రైస్తవ సోదరులు, మత పెద్దలు, పాస్టర్లు, ప్రజా ప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదికూడా చదవండి…

తాండూరులో ఉచిత క్యాన్సర్ స్ర్ర్కీనింగ్ క్యాంపు