నాగులపల్లి మల్లేశం కన్నుమూత
– అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన నేత
– సంతాపం ప్రకటించిన నేతలు
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోకవర్గం పెద్దేముల్ మండలానికి చెందిన సీనీయర్ నేత నాగులపల్లి మల్లేశం(80) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. నాగులపల్లి మల్లేశం స్వర్గీయ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, తాండూరు ప్రాంతానికి చెందిన దివంగత మాజీ మంత్రులు ఎం. మాణిక్‌రావు, ఎం. చందుమహారాజ్‌లతో కలిసి కాంగ్రెస్ పార్టీతో పాటు మండల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఎలాంటి మచ్చలేని రాజకీయాలతో ప్రజల మనస్సుల్లో స్థానం సంపాదించుకున్నారు. దీంతో ప్రజలే ఊరిపేరునే ఆయన ఇంటి పేరుగా ఆపాదించారు. అప్పటి నుంచి నాగుపల్లి మల్లేశం ప్రజలకు గుర్తిండిపోయారు. గత కొన్నాళ్ల క్రితం కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరారు. అనారోగ్యానికి దూరం కావడంతో పార్టీ కార్యక్రమాలకు, రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కన్నుమూశారు. నాగులపల్లి మల్లేశం మరణ వార్త తెలిసిన తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సంతాపం ప్రకటించారు.

