పూలనే పూజించే గొప్ప సంస్కృతి

తాండూరు వికారాబాద్

పూలనే పూజించే గొప్ప సంస్కృతి
– చైతన్య జూనియర్ కళాశాల కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి 
– చైతన్య జూనియర్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు...

తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు పట్టణంలోని చైతన్య జూనియర్ కళాశాలలో బతుకమ్మ ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థినిలు, అధ్యాపకులు కోలాటం ఆడుతూ బతుకమ్మ పాటలు పాడుతూ ఆడిపాడారు. అన్నీ పూజలకు పువ్వులను పెడితే బతుకమ్మ ఉత్సవాల్లో పూలనే పూజించే గొప్ప సంస్కృతి భారతదేశంలో కలదని కళాశాల కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ బతుకమ్మ ఉత్సవాలకు ప్రత్యేక నిధులు కేటాయించడం అభినందనీయమని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతున్న సర్కార్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సోమ్నాథ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.