రానున్నది మహిళల స్వరాజ్యమే..!
– సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో రాజకీయాల్లో రాణించాలి
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాబోయే రోజుల్లో మహిళల స్వరాజ్యం సాధించడం ఖాయమని, సావిత్రిబాయి పూలే స్పూర్తితో మహిళలు రాజకీయ రంగంలో రాణించాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు.
శనివారం బీసీ సంఘం ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో సావిత్రి బాయి పూలే జయంతిని ఘనంగా జరుపుకున్నారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి కందుకూరి రాజ్ కుమార్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి పూలేను మహిళలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

విద్య, వైద్యం తదితర రంగాలలో పాటు రాజకీయ రంగంలో కూడా కీలక పాత్ర పోషించాలన్నారు. భారత రాజ్యాంగం ద్వారా రాష్ట్రంలో మహిళలకు 40 స్థానాలలో రిజర్వేషన్లు కేటాయిస్తున్నారని, తాండూరు నియోజకవర్గంలో కూడా రానున్న రోజుల్లో మహిళ స్థానం రిజర్వేషన్ అవడం ఖాయమన్నారు. నియోజకవర్గంలో మహిళలే అధికంగా ఉన్నారని, తాండూరులో మహిళ ఎమ్మెల్యే కావడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, వడిచెర్ల పరమేష్, వివేక్, నవీన్, శ్రీకాంత్, సుధారాణి, శ్రీలత, మాధవి తులసీ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

