రేపు బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ
– హాజరు కానున్న మాజీ మంత్రి సబితారెడ్డి
– పాల్గొంటున్న చేవేళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్
– సభా ఏర్పాట్లను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ పార్టీ ప్రచారం ఊపందుకుంది. తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఎన్నికల నేపథ్యంలో రేపు యాలాల, బషీరాబాద్ మండలాలకు సంబంధించి ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. గురువారం యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ సమీపంలో ఆశీర్వాద సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సభా స్థలిని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నేడు సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తున్న సభకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ చేవేళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ లు హాజరవుతున్నట్లు వెల్లడించారు. ఈ ఆశీర్వాద సభకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జెడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్. లైబ్రరీ మాజీ చైర్మన్ రాజుగౌడ్, నాయకులు అరవింద్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

