శ్రీశైల మల్లన్న సన్నిధిలో ఎమ్మెల్యే ఫ్యామీలీ
– కుటుంబ సమేతంగా దర్శించుకున్నబీఎంఆర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : శ్రీశైలంలోని మల్లన్న సన్నిధిలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి(బీఎంఆర్) కుటుంబం తరించింది. శుక్రవారం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను కుటుంబ సమేతంగా దర్శించికున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు ఎమ్మెల్యేను, కుటుంబ సభ్యులను ఆశీర్వచనం చేసి, తీర్ధ ప్రసాదాలు అందచేశారు. మరోవైపు దేవస్థానంలో అన్నదానం కోసం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రూ. 1లక్ష 116ల విరాళం అందజేశారు.
ఇదికూడా చదవండి…

