పేదలకు అండగా సేవా కార్యక్రమాలు

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

పేదలకు అండగా సేవా కార్యక్రమాలు
– జిల్లా ఆసుపత్రి, ఎంపీహెచ్ అభివృద్ధికి తోడ్పాటు
– బీఆర్ఎస్ యువనాయకులు పట్నం రినీష్ రెడ్డి
– పీఎంఆర్ ట్రస్ట్ ద్వారా అన్నదాన సేవలకు శ్రీకారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : పీఎంఆర్ ట్రస్ట్ ద్వారా పేదలకు అండగా నిలిచే సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునితా మహేందర్ రెడ్డిల కుమారుడు, బీఆర్ఎస్ యువనాయకులు పట్నం రినీష్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పీఎంఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. సోమవారం తాండూరు పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రి, ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో పీఎంఆర్ ట్రస్ట్ ద్వారా ప్రతిరోజూ అన్నదాన కార్యక్రమ సేవలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాలకు రినీష్ రెడ్డి హాజరై తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, నేతలతో కలిసి అన్నదానంను ప్రారంభించారు.

ఈ సందర్భంగా రినీష్ రెడ్డి మాట్లాడుతూ సేవే దక్పథంతో ముందుకు సాగడం జరుగుతుందని అన్నారు. పీఎంఆర్ ట్రస్ట్ ద్వారా ఆసుపత్రికి వచ్చే రోగుల వెంబడి ఉండే బందువులుకు, కుటుంబ సభ్యులకు అన్నదానం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని అన్నారు. అదేవిధంగా జిల్లా ఆసుపత్రి, ఎంసీహెచ్ ఆసుపత్రులలో మౌళిక సదుపాయాల కల్పనకు తమవంతు తోడ్పాటు అందిస్తామన్నారు. పీఎంఆర్ ట్రస్ట్ ద్వారా పేదలకు అండగా నిలిచే సేవా కార్యక్రమాలను చేపడుతామన్నారు. మరోవైపు మాతా శిశు ఆసుపత్రిలో రోగులకు, బందువులకు, అల్పహారం, అన్నదానం చేస్తున్న నజీర్‌ను అభినందించి.. సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శోభారాణి, కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, బోయరవి, రాము, నాయకులు మసూద్, యువనాయకులు బిర్కడ్ రఘు, నేతలు, రినీష్ రెడ్డి అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

తాత తడబడలేదు..!

chaithany collage