ఉద్యమ కారుడి కుటుంబానికి చేయూత

తాండూరు రాజకీయం వికారాబాద్

ఉద్యమ కారుడి కుటుంబానికి చేయూత
– రూ. 10వేల ఆర్థిక సాయం అందించిన శ్రీనివాస్ రెడ్డి
– కుటుంబానికి అండగా ఉంటామని భరోసా
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు సంగమేశ్వర్ కుటుంబానికి స్థానిక కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి చేయూతనందించారు. పట్టణంలోని వడ్డెర గల్లికి చెందిన తెలంగాణ ఉద్యమ కారుడు సంగమేశ్వర్ బుధవారం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్ రెడ్డి తన అనుచరుల ద్వారా కుటుంబానికి రూ. 10వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.

ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ సంతాపాన్ని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన సంగమేశ్వర్ కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు, సదుపాయాలు కల్పించే విధంగా కృషి చేస్తానని కుటుంబ సభ్యులకు భరోసా అందజేశారు. ఆర్థిక సాయం. భరోసా అందించిన శ్రీనివాస్ రెడ్డికి కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు.

ఇదికూడా చదవండి…

ప్రాణాలు కాపాండండి..!