మార్కెట్ కమిటీలకు కొత్త చైర్మన్లు..!
– తాండూరు, బషీరాబాద్, కోట్‌పల్లిలకు పేర్లు ఖరారు
– ప్రభుత్వానికి సిఫార్సు చేసిన తాండూరు ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలకు కొత్త చైర్మన్లు, వైస్ చైర్మన్లు వస్తున్నారు. తాండూరు, బషీరాబాద్, కోట్‌పల్లి మండలాల్లోని మార్కెట్ కమిటీలకు పాలకవర్గం పేర్లను ఖరారు అయినట్లు తెలుస్తోంది. వచ్చేనెల 4 తర్వాత ఎన్నికల కోడ్ ముగియగానే అధికారికంగా వారి పేర్లు ప్రక టించే అవకాశాలున్నాయి. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కొత్త చైర్మన్లు, వైస్ చైర్మన్ల పేర్లను ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు సమాచారం.
తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ బీసీకి రిజర్వ్ కాగా, బషీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఓసీ జనరర్, కోట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎస్సీ కేటగిరీలకు రిజర్వయ్యాయి. దీంతో జిల్లా లోనే పెద్ద వ్యవసాయ మార్కెట్ అయిన తాండూరు వ్యవసాయ కమిటీ చైర్మన్ గా తాండూరు పట్టణం సాయిపూర్‌కు చెందిన పట్లోళ్ల బాల్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా యలాల మండలానికి చెందిన నర్సిరెడ్డి, బషీరా బాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవ రెడ్డి, కోట్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా అంజయ్య, వైస్ చైర్మన్‌గా నారాయణరెడ్డి పేర్లను ప్రతిపాదించినట్లు రాజకీయాల్లో ప్రచారం ఉంది. ప్రభుత్వం నుంచి అధికారికంగా జీవో మాత్రమే వెలువడాల్సి ఉంది.


ఇదికూడా చదవండి…

