కరెంటు ఆఫీసులో కూలీ మృతి

క్రైం తెలంగాణ రాజకీయం వికారాబాద్

కరెంటు ఆఫీసులో కూలీ మృతి
– 3 రోజుల క్రితం మరణించినట్లు డౌట్
– ఆలస్యంగా వెలుగులోకి సంఘటన
– దర్యాప్తు జరుపుతున్న పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు కరెంటూ ఆఫీసులో ఓ కూలీ మృతి చెందడం కలకలం రేపింది. ముందుగా గుర్తుతెలియని వ్యక్తి మృతదేహంగా అనుమానించగా మృతుడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎట్టకేలకు ఆచూకీ దొరికింది. తాండూరు పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం చెనుగోముల్ గ్రామానికి చెందిన భీమమోళ్ల నర్సింలు(51) ఎక్కడపడితే అక్కడ కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. అప్పుడడప్పుడు ఇంటికి వెళ్లి తిరిగి పనులకు వెళ్లేవాడు.

ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల తరువాత ఇంటికి వెళ్లి నర్సింలు తిరిగి ఈనెల 24వ తేదిన ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. అయితే సోమవారం మధ్యాహ్నం తాండూరు పట్టణంలోని విద్యుత్ కార్యాలయంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమచారం అందించారు. మృతుడు మూడు రోజుల క్రితమే మరణించినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు మృతదేహం ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

దీంతో నర్సింలు కుటుంభీకులు విషయం తెలుసుకుని తాండూరుకు వచ్చి జిల్లా ఆసుపత్రిలోని మార్చురిలో మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు నర్సింలు అనే కుమారుడు యాదగిరి గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదికూడా చదవండి…

దత్తాత్రేయ స్వామి సేవలో బీఎస్ఆర్..!