జిల్లాలోని స్కూళ్లకు స్వచ్ఛ నిధులు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

జిల్లాలోని స్కూళ్లకు స్వచ్ఛ నిధులు..!
– అమ్మ ఆదర్శ కమిటీల ఖాతాలో జమ
– వెల్లడించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌
వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఆదర్శ పాఠశాలలకు స్వచ్ఛ నిధులు మంజూరు చేసింది. సోమవారం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 1007 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలతో పాటు ఆదర్శ పాఠశాలలకు నిధులు మంజూరు చేయడం జరిగిందని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారం పారిశుధ్య కార్యక్రమాల నిమిత్తమై మూడు నెలలకు గాను రూ.1,68,93,000/- నిధులు మంజూరు చేయడం వివరించారు. ఈ నిధులను ఆయా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఖాతాల్లో జమ చేయడం జరిగిందని తెలిపారు. పాఠశాలల్లోని పరిసర ప్రాంతాలు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచే ఈ కార్యక్రమాలను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటిలు బాధ్యతగా పర్యవేక్షించాలని ఆదేశించారు. మరోవైపు జిల్లాలోని పాఠశాలలకు స్వచ్ఛ నిధులను మంజూరు చేయడం పట్ల పలువురు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

ఇదికూడా చదవండి…

డబ్బుల దండ లాగేసిన దొంగ..!