తాగిన మైకంలో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
– కరణ్ కోట్ పోలీస్టేషన్లో కేసు నమోదు
– వివరాలు వెల్లడించిన ఎస్ఐ విఠల్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాగిన మైకంలో ఉరేసుకుని ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన తాండూరు మండలం కరణ్ కోట్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆదివారం ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెద్దేముల్ మండలం అడ్కిచెర్ల గ్రామానికి చెందిన వడ్డె రాజు (30) తాండూరు పట్టణ సమీపంలోని బసవేశ్వరనగర్ లో ఉన్న మారుతి స్టోన్ పాలిషింగ్ యూనిట్లో లేబర్ గా పనిచేస్తున్నాడు. వడ్డె రాజుకు మద్యం అలవాటు ఉండడంతో అతని భార్యతో గొడవలు జరుగుతుండేవి.

శనివారం రాత్రి కూడా రాజు మద్యం సేవించడంతో మళ్లీ గొడవ జరిగింది. దీంతో మనస్థాపం చెందిన రాజు తాగిన మైకంలో ఉంటున్న భవనంలోనే పైగదిలో రాజు ఇనుప రాడ్ కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదే సమయంలో రాజు భార్య కింద గదిలోనే ఉంది. కొద్ది సేపటి తరువాత గమనించి కరణ్ కోట్ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు.

ఇదికూడా చదవండి…

