అంతా భాగానే ఉంది..!

తాండూరు రాజకీయం వికారాబాద్

chai jrఅంతా భాగానే ఉంది..!
– త్వరలోనే తాండూరుకు వస్తా
– బెడ్‌ పైనుంచే రోహిత్ రెడ్డి సందేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎవ్వరు ఆధైర్య పడకండి.. మీ అభిమానం.. ఆశీర్వాదాలతో అంతా భాగానే ఉందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. పైలెట్ రోహిత్ రెడ్డి అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరిన సంఘటన ఆదివారం వైరల్‌గా మారింది. ఈ సంఘటనపై రోహిత్ రెడ్డి స్పందించారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న బెడ్‌ పైనుంచే మాట్లాడుతూ విడీయో సందేశాన్ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరు ప్రజలందరి అభిమానం, ఆశీర్వాదాలతో కోలుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. జ్వరం కారణంగానే ఆసుపత్రిలో చేరడం జరిగిందన్నారు. రెండు మూడు రోజుల్లోనే డిశ్చార్జ్ అవుతానని, త్వరలోనే తాండూరుకు వస్తానని తెలిపారు. ప్రజలు, అభిమానులు ఎవ్వరు ఆధైర్య పడొద్దని అన్నారు.

ఇదికూడా చదవండి..

పైలెట్‌కు అస్వస్థత..!