బాధితులకు అండగా ఉంటాం..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

chai jr
బాధితులకు అండగా ఉంటాం..!

– ఆర్బీఓఎల్‌ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి
– అనివార్య రోగ బాధితులకు పౌష్టికాహార కిట్ల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : అనివార్య రోగ భాధితులకు అండగా ఉంటామని తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్‌ సీఈఓ శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని అనివార్య రోగ బాధిత చిన్నారులకు పౌష్టిక ఆహారం కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ అనివార్య రోగాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. రోగాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా జీవితకాలాన్ని పెంచుకోవచ్చునని అన్నారు.

అదేవిధంగా బాధితుల పట్ల వివక్ష చూపకూడదని కోరారు. బాధితులకు సహాయ సహకారాలు అందించడానికి ఆర్బీఓఎల్‌ సంస్థ తరపున తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పట్లొళ్ళ బాల్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, బంటు వేణు, ప్రభుత్వ వైద్య అధికారులు డాక్టర్ సమీఉల్లా, డాక్టర్ రమణ బాబు, నాయకులు బాతుల నాగు, కిరణ్ పటేల్, వికాస్ జోషి, సచిన్ ముదిరాజ్, భరత్, నర్సింహా రెడ్డి, విష్ణు, నరేష్ , మణి , కోట్ల రాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

నారాయణ విద్యార్థులకు భరోసా..!