
గోవుల అక్రమ రవాణాకు కళ్లెం వేయండి
– తరలించకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
– ఆర్డీఓ, మున్సిపల్ అధికారులకు బీజేపీ వినతి
తాండూరు, దర్శిని ప్రతినిధి : గోవులను, దూడలను తరలించకుండా అక్రమ రవాణాకు కళ్లెం వేయాలని తాండూరు బీజేపీ నేతలు డిమాండు చేశారు. శుక్రవారం బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో తాండూరు ఆర్డీఓ, మున్సిపల్ అధికారులకు వినతిపత్రాలను అందజేశారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రెండు రోజుల్లో జరగబోయే బక్రీద్ పండగ నేపథ్యంలో నియోజకవర్గంలో ఎక్కడ కూడా గోవులను, లేగ దూడలను తరలించకుండా చర్యలు చేపట్టాలని కోరారు. నిబంధనలకు విరుద్దంగా ఆవులను, దూడలను వధించకుండా దృష్టిసారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బాలప్ప, ప్రధాన కార్యదర్శి కిరణ్ ముదిరాజ్, నాయకులు కోట్ల నరేందర్, చిద్రి ప్రకాష్, దోమ కృష్ణ, సంగమేశ్వర్, చందు, శివకుమార్, శివశర్మప్ప తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

