రక్తదాతలు.. ప్రాణదాతలే..!

తాండూరు రాజకీయం వికారాబాద్

chai jrరక్తదాతలు.. ప్రాణదాతలే..!
– మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో శిబిరం
– స్వచ్చందంగా రక్తదానం చేసిన దాతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆపదలో ఉన్న వారి కోసం రక్తదానం చేసిన వారంతా ప్రాణదాతలుగా నిలుస్తారని తాండూరు మార్వాడి యువమంచ్ ప్రతినిధులు అభివర్ణించారు. ప్రపంచ రక్తదాత దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. స్థానిక బాలాజీ మందిరంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పలువురు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రంలో రక్త నిల్వలు తగ్గినట్లు తెలుసుకుని ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

రక్తనిధి కేంద్ర వైద్య సిబ్బంది సహాకారంతో దాతల నుంచి సేకరించిన రక్త నిల్వలను ఆసుపత్రికి అందజేసి మార్వాడి యువమంచ్ మరోసారి మానవత్వాన్ని చాటుకుంది. ఈ సందర్బంగా మార్వాడి యువమంచ్ అధ్యక్షులు అనిల్ సార్డాతో పాటు మన్మోహన్ సార్డా, ఓం ప్రకాష్ సోమాని, సూర్య ప్రకాష్‌ సోమాని, భగ్‌వాన్ దాస్ బూబ్‌, దీపక్ గగ్రాని తదితరులు మాట్లాడుతూ రక్తదానం మహాదానం అన్నారు. ఆపదలో ఉన్న వారిని కాపాడేందుకు చేసే రక్తదానంలో దాతలందరు ప్రాణదాతలుగా నిలుస్తారని అన్నారు.

అందరు రక్తదానం చేసేందుకు ముందుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచ్ కార్యదర్శి సచిన్ రాఠి, కోశాధికారి అరుణ్ సార్డా, రామానుజ్‌దాస్ సోని, రామ్ నారాయణబూబ్, కుంజ్ బిహారి సోని, మహేష్‌ సార్డా, క్యాంపు కన్వీనర్ కరన్‌జైన్, కోకన్వీనర్ రమాకాంత్ పండిత్, సభ్యులు రోహిత్ అగ్రవాల్, దీపక్ బూబ్, నిఖిల్ గగ్రాని, రోహిత్ సోని, కిషన్ బూబ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

గ్యారెంటీలకు టెన్షన్‌ లేదు..!