టీయూడబ్ల్యూజే ఐజేయూ వికారాబాద్ నియోజకవర్గ నూతన కమిటీ ఎన్నిక
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(టీయూడబ్ల్యూజే) ఐజేయూ వికారాబాద్ నియోజకవర్గ నూతన కమిటిని మంగళవారం ఎన్నుకున్నారు. వికారాబాద్ అధ్యక్షులుగా మల్లేశ్ (వార్త, మర్పల్లి), ప్రధానకార్యదర్శులుగా గోపాల్ (మన తెలంగాణ, బంట్వారం), వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జాక వెంకట్(శనార్థి తెలంగాణ), కోశాధికారిగా అశోక్ (సూర్య వికారాబాద్), ఉపాధ్యక్షులుగా వినయ్ కుమార్ (స్టుడియో ఎన్), మారుతి (నమస్తే తెలంగాణ, మోమిన్‌పేట్), కార్యదర్శులుగా బాల్ రాజ్ (ప్రజాపక్షం, ధారూర్), రత్నం (మన తెలంగాణ, నవాబుపేట), కార్యవర్గ సభ్యులుగా ప్రవీణ్ చారి (ETV), బుచ్చయ్య (మన తెలంగాణ, కోట్ పల్లి), వెంకటయ్య, (నినాదం,వికారాబాద్ రూరల్), ప్రమోద్ (మనం, వికారాబాద్)లను ఎన్నుకున్నారు.
