ఇందిరానగర్ కేసులో మరో ఆరుగురి రిమాండ్
– వివరాలు వెల్లడించిన పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం ఇందిరానగర్‌లో కలకలం రేపిన కత్తులు, కర్రలతో దాడి కేసులో మరో ఆరుగురిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సోమవారం పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈనెల 15న అర్దరాత్రి దాటిన తరువాత చంద్రథియేటర్ సమీపంలోని భవాని మాత ఆలయం వద్ద శరన్నవ రాత్రి ఉత్సాలలో గరీబ్ నగర్‌కు చెందిన మిర్యాణం నవీన్ అలియాస్ బొండాల చిన్నా బాతుల శ్రీధర్ అలియాస్ టిల్లులు మహమ్మద్ రఫీ, బాతుల శ్రీకాంత్, వినోద్, తలారీ భాను, రచంట్ల శ్రీకాంత్, శేఖర్‌లతో కలిసి నరేందర్, రవిచందర్‌లపై కొబ్బరికాయలు నరికే రెండు కత్తులతో, కట్టెలతో దాడి చేశారు. ఈ దాడిలో నరేందర్, రవీందర్‌లకు చేతులకు, తలకు బలమైన గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు 16వ తేదిన నవీన్, రఫీలను రిమాండ్ చేయగా మిగతా నిందితులు పరారిలో ఉండిపోయారు. సోమవారం పరారిలో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్ చేసినట్లు సీఐ రాజేందర్‌రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ ఎస్ఐ సతీష్, సిబ్బంది ఉన్నారు.
