– సన్మానించిన మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ దీపా నర్సింలు
తాండూరు, ఆగస్టు 15 (దర్శిని) : తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్‌కు ఉత్తమ అవార్డును వరించింది. ప్రతి యేడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో వివిధ శాఖలలో పనిచేసే అధికారులకు ఉత్తమ అవార్డులను ప్రకటించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఆదివారం నిర్వహించిన 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్‌కు ఉత్తమ అవార్డు వరించింది.


దీంతో తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు ఆర్డీఓ అశోక్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఆయనను కలిసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ యువ నాయకులు సంతోష్ గౌడ్, సంజీవరావు, ఇంతియాజ్, గుండప్ప తదితరులు ఉన్నారు.

