కన్నుల పండగైన వేడుక..!
– అట్టహాసంగా రాయికుంట కట్టమైసమ్మ ప్రతిష్టాపన ఉత్సావాలు
– ఆధ్యాత్మిక మయమైన పూజా కార్యక్రమాలు
– పాల్గోన్న వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు దంపతులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ 9వ వార్డులోని వీరశివాజీ నగర్లో శ్రీ రాయికుంట కట్టమైసమ్మ అమ్మవారి ప్రతిష్టాపన ఉత్సవాలు కన్నుల పండగలా ప్రారంభమయ్యాయి. ఆషాడ మాసం సందర్భంగా బుధవారం దేవాలయంలో అమ్మవారి ప్రతిష్టాపన ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్ సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా, మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల సావిత్రమ్మలు అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలలో పాల్గొన్నారు.
ప్రముఖ పండితులు విశ్వం పంతులు, డా. రాజశేఖర్ స్వామి, చంద్రశేఖర్ స్వామి, రవికాంత్ స్వామి, మఠం చంద్రశేఖర్ స్వామి, మల్లికార్జున స్వామి, పర్వయ్య స్వామి ఆధ్వర్యంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అగ్రోదకం, గోపూజ, ఆలయ ప్రవేశం, మాతృక, వాస్తు క్షేత్ర పాలక, అగ్ని ప్రతిష్ట, జలాదివాసం, మంగళహారతి కార్యక్రమాలతో దేవాలయ ప్రాంగణం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. పట్లోళ్ల నర్సింలు, దీపా, సావిత్రమ్మలు పూజా తతంగాలను పూర్తి చేశారు.
మరోవైపు రేపు గురువారం, శుక్రవారం కూడా కార్యక్రమాలు కొనసాగుతాయని ఆలయ కమిటి తెలిపింది. సాయిపూర్లోని హనుమాన్ దేవాలయం నుంచి వీరభద్ర విన్యాసం ఊరేగింపు, శుక్రవారం విగ్రహ రత్న ప్రతిష్ట, సామూహిక హోమం, అమ్మవారి కళ్యాణం, మంగళహారతి కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. ఈ ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని విజ్ఞఫ్తి చేశారు.
ఇదికూడా చదవండి…

