మృతుల కుటుంబాలకు పరిహారం..!

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

మృతుల కుటుంబాలకు పరిహారం..!
– గాయపడిన బాధితులకు కూడా ప్రకటన
– కేంద్ర ప్రభుత్వ పథకం నుంచి సాయం
– ప్రకటించిన ప్రభుత్వం, మోడి దిగ్బ్రాంతి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు అండగా ఉంటామని ప్రభుత్వం తెలిపింది.

ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.7లక్షలు, గాయపడిన వారికి కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున పరిహారం ప్రకటిచింది.
kvcs

ప్రధాని మోదీ దిగ్బ్రాంతి.. పరిహారం ప్రకటన
మరోవైపు చేవెళ్ల బస్సు ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 20 మందికిపైగా ప్రయాణికులు చనిపోయారన్న వార్త తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం.. క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున సాయం ప్రకటించింది.

ఇదికూడా చదవండి…

7 మంది పురుషులు, 12 మంది మహిళలు, ఓ చిన్నారి