రేపు ఎంపీ కొండాకు పౌర సన్మానం

తాండూరు రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

 

రేపు ఎంపీ కొండాకు పౌర సన్మానం
– తాండురు పట్టణంలో ఏర్పాట్లు
– ఫంక్షన్ హాల్ పరిశీలించిన నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: రేపు చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి తాండూరు బీజేపీ నేతలు పౌర సన్మానం ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్, పట్టణ అధ్యక్షుడు నాగారం మల్లేశంలు ప్రకటించారు. రేపు శుక్రవారం మధ్యాహ్నం 12-30 గంటలకు పట్టణంలో సన్మానానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా పట్టణంలోని సాయిపూర్ తులసి గార్డెన్ ను సందర్శించారు.

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధించడం పట్ల రేపు పౌర సన్మానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తులసి గార్డెన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జిల్లా మండల నాయకులు, కౌన్సిలర్లు, శక్తి కేంద్రం ఇన్చార్జులు, బూత్ అధ్యక్షులు,కార్యకర్తలు,
బీజేపీ అభిమానులు, శ్రేయోబిలాషులు, కుల సంఘాలు, హిందూ అనుబంధ సంఘాలు వారి ప్రతినిధులు అందరూ అధిక సంఖ్య లో పాల్గొని జయప్రదం చేయగలరని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, కౌన్సిలర్ల సాహు శ్రీలత లక్ష్మీకాంత్, జిల్లా అధికార ప్రతినిధి జంటిపల్లి వెంకట్, నాయకులు దోమ కృష్ణ, అంతారం కిరణ్, కార్యకర్తలు ఉన్నారు.

 

ఇదికూడా చదవండి…

బార్లీ వాటర్.. వెరీ బెటర్..!