డైరెక్ట్ అకౌంట్లోకే…!
– అధికారుల పకడ్బందీ చర్యలు
– పేరులేని వారికోసం సహాయకేంద్రం
– టోల్ ఫ్రీ నెంబర్ ప్రకటించిన అధికారులు
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణమాఫీ అమలు కోసం జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టిసారించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలతో తొలివిడతగా రూ. 1లక్ష వరకు రుణమాఫీని గురువారం నుంచి అమలు చేస్తోంది. ఈ నిర్ణయంతో జిల్లా లో 46,633 మంది రైతులకు గాను 256.26 కోట్ల రూపాయలు రైతులకు రుణ మాఫీ లభించనుంది. ప్రభుత్వం అర్హులుగా గుర్తించిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటోంది. నేరుగా రైతుల ఖాతాలో నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు సిద్దం చేసింది.
అదేవిధంగా జిల్లాలో ప్రభుత్వం గుర్తించిన రైతుల వివరాలను ప్రతి రైతు వేదికలో రైతుల యొక్క లిస్టు ప్రదర్శించాలని వ్యవసాయ విస్తరణ అధికారులను ఆదేశించింది. ప్రతి గ్రామా పంచాయతి లో కూడా రైతులకు సంబంధించి వివరాలతో కూడిన బ్యానర్లు ఏర్పాటు చేయాలనీ వ్యవసాయ అధికారికి ఆదేశించింది. 30 రోజుల పాటు వ్యవసాయ విస్తరణ అధికారులు అందుబాటులో ఉండి రైతు రుణమాఫీ రైతులకు చేరేలా చూసేలా చర్యలు చేపడుతోంది.
రుణమాఫీ జాబితాలో ఎవరైనా రైతుల పేర్లు లేని వారు వివరాలను తెలుసుకునేందుకు జిల్లా కల్లెక్టేట్ కార్యాలయంలో రుణమాఫీ సహాయ కేంద్రంను ఏర్పాటు చేశారు. అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్ లకు 9989291049 , 9000470989ను ప్రకటించారు. వివరాలు తెలుసుకునేందుకు సహాయ కేంద్రం, టోల్ ఫ్రీ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
ఇదికూడా చదవండి…

