శ్రీ సాయి మేధ విద్యాలయంలో బోనాల జాతర

తాండూరు రాజకీయం వికారాబాద్

శ్రీ సాయి మేధ విద్యాలయంలో బోనాల జాతర
– సంప్రదాయంగా బోనాలు సమర్పించిన విద్యార్థులు
– ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు
తాండూరు, దర్శిని ప్రతినిది : తాండూరు పట్టణం శివాజీ చౌక్ సమీపంలోని శ్రీ సాయి మేధ విద్యాలయంలో సోమవారం బోనాల జాతర ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఆషాడ మాసంను పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులు సంప్రదాయంగా వేడుకలు నిర్వహించారు.

పాఠశాలలో అమ్మవారి అమ్మవారి ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. అదేవిధంగా పాఠశాల ముందు ఉన్న సౌరమ్మ దేవాలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించారు. విద్యార్థులు బోనాలు ఎత్తుకుని పాఠశాలతో పాటు సౌరమ్మ దేవాలయంలో అమ్మవారి చుట్టూ ప్రదక్షణలు చేశారు. బోనాల ముందు విద్యార్థుల పోతురాజుల విన్యాసాలతో ఆకట్టుకున్నారు. భక్తిశ్రద్దలతో బోనాల నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి ఉత్తమ బోనాలు, ప్రదర్శన ఇచ్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బోనాల పండుగ నిలుస్తోందని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలంతా చల్లంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు మంజుల రెడ్డి, కల్పన, ప్రిన్సిపల్ సజిత, వైస్ ప్రిన్సిపల్ నవీన్ కుమార్, ఉపాధ్యాయులు, తల్లింద్రడులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ముహుర్తం