రహదారికి రాజయోగం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

రహదారికి రాజయోగం..!
– డబుల్‌ రోడ్డుగా తాండూరు-వికారాబాద్‌ రూట్
– స్పీకర్‌, తాండూరు ఎమ్మెల్యే స్పెషల్ ఫోకస్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు – వికారాబాద్ రోడ్డుకు రాజయోగం కలగబోతోంది. రూ.100కోట్లతో ఈ రోడ్డును డబుల్‌ రోడ్డుగా మార్చబోతున్నారు. ఈ నెల 27న రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్రెడ్డి, రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిలతో ఈ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసేందుకు ముహుర్తం నిర్ణయించారు. ఇందుకు కోసం తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు స్పెషల్ ఫోకస్ పెట్టారు.

తాండూరు – వికారాబాద్‌ మార్గంలో తాండూరు పనులు చేపట్టానున్నారు. ప్రతి రోజు మూడు వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అధిక లోడ్‌తో నాపరాళ్లు, సుద్ద, సిమెంట్ వాహనాలు వెళ్తుండటంతో తడ్డు గుంతలమయమౌతుంది. తరుచు గుంతలు పడి రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది. దీంతో ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించి చేసిన రివైజ్డ్ ఎస్టిమెంట్ తయారు చేశారు. రూ. 100 కోట్లతో రోడ్డు నిర్మాణం చేపట్టబోతున్నారు. డబుల్ రోడ్డు నిర్మాణా నికి ఇప్పటికే రూ.50 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. మరో రూ.50కోట్లు కేటాయించేందుకు ప్రతిపాదనలు చేశారు.

ప్రస్తుతం మిగతా నిధులకు సంబంధించిన ప్రాతిపదనలు ఆర్అండ్ బి చీఫ్ ఇంజనీర్ నుంచి ఆర్థిక శాఖ అనుమతి కోసం వెళ్లింది. రెండు మూడు రోజుల్లో అనుమతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.  అయితే  రోడ్డు పనులపై తాండూరు – వికారాబాద్‌ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదికూడా చదవండి…

టీ స్టాల్‌లో మంటలు..!