గురుపౌర్ణమి సందడి..!
– శోభాయమానం సాయిబాబా రథయాత్ర
– మున్సిపల్ చైర్ పర్సన్ పూజలు
– ప్రారంభించిన పట్టణ ప్రముఖులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులో గురుపౌర్ణమి వేడుకలు సందడిగా ప్రారంభమయ్యాయి. గురుపౌర్ణమి మహోత్సవాన్ని పురస్కరించుకుని తాండూరు – కోకట్ రోడ్డు మార్గంలో వెలసిస షిర్డిసాయిబాబా భజన మండలి ఆద్వర్యంలో సాయిబాబా రథయాత్ర ఊరేగింపు చేపట్టారు. శనివారం తాండూరు పట్టణంలోని కోడంగల్, అంబేద్కర్ చౌరస్తా సమీపంలో ఉన్న భవాని మాత దేవాలయం నుంచి ఈ శోభాయాత్ర ముందుకు కదిలింది. తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, జిల్లా లైబ్రరీ మాజీ చైర్మన్ రాజుగౌడ్, సాయిపుత్ర హోమ్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్, చంద్రకళ దంపతులు, సాయిలుగౌడ్ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం దేవాలయం ముందు నుంచి సాయిబాబా రథయాత్ర శోభాయమానంగా ముందుకు సాగింది. వర్షంలో కూడా పట్టణంలోని పుర వీదులగుండా ఈ ఊరేగింపు కొనసాగింది. ఊరేగింపు ముందు భక్తులు సాయిబాబా మహిమలను చాటుతూ భజన కీర్తనలు ఆలాపించారు. ఈ ఊరేగింపుకు ప్రజలు, భక్తులు స్వాగతం పలుకుతూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
ఇదికూడా చదవండి…

