గొల్ల చెరువును కాపాడండి..!
– కబ్జాల రిజిస్ట్రేషన్లను ఆపాలి
– ప్రభుత్వ అధికారులకు బీజేపీ వినతి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ఏకైక జలాశయం గొల్ల చెరువు ప్రాంతాన్ని పరిరక్షించాలని స్థానిక బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో ఆర్డీఓ, సబ్ రిజిస్ట్రార్, ఇరిగేషన్, మున్సిపల్, ఆర్అండ్‌బీ శాఖల అధికారులకు వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని గొల్ల చెరువు శిఖం భూమిలో కొందరు వ్యక్తులు కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సర్వేనెంబర్లో బై నెంబర్లు వేసుకుని రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారని అన్నారు. గొల్ల చెరువు భూములను కాపాడాలని, రిజిస్ట్రేషన్లు జరగకుండా ఆపాలని కోరారు.
లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు అంతారం లలిత, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, పట్టణ ఉపాధ్యక్షులు దోమ కృష్ణ, ప్రధాన కార్యదర్శి అంతారం కిరణ్, కార్యదర్శులు బిచ్చప్ప, చందు, జిల్లా ఎస్సీ మోర్చ్ అధ్యక్షులు శ్రీకాంత్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు తాండ్ర నరెష్, గీతా మోర్చ్ ప్రభాకర్ గౌడ్, వడ్డె సాయిలు, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

