ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా
– ఒక్కో గ్రూపులో టాపర్లుగా నిలిచిన బాలికలు
– భాష్యం, చైతన్య, సిద్దార్థ, సింధు కళాశాలల ప్రభంజనం
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో తాండూరు అమ్మాయిలు హావా కొనసాగింది. గురువారం మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. ఫలితాల్లో తాండూరు పట్టణంలోని వివిధ కళాశాలల్లో అమ్మాయిలు సత్తా చాటారు. పట్టణంలోని భాష్యం కళాశాల విద్యార్థిని జె .భాగ్యలక్ష్మి ఎంపీసీలో 463/470 మార్కులు సాధించి తాండూరు టాపర్‌గా నిలిచింది. అదేవిధంగా సిద్ధార్థ కళాశాలకు చెందిన హరిత బైపీసీలో 429/440 మార్కులు సాధించగా సింధు బాలికల కళాశాలకు చెందిన బీబిసారా సీఈసీలో 487/ 500 మార్కులు సాధించింది. చైతన్య కళాశాలకు చెందిన మేఘ లాహోటి ఎంఈసీలో 473/500 మార్కులు సాధించి తాండూర్ టాపర్లుగానిలిచారు. పట్టణానికి చెందిన అన్ని కళాశాలలో ఒక్కో గ్రూపులో సత్తా చాటి టాపర్లుగా నిలువడం గమనార్హం. ఈ సందర్భంగా ఆయా కళాశాలల ప్రిన్సిపాల్‌లు సాక్షి రామకృష్ణ, నరేందర్, సంగీత, సోమనాథ్ యాజమాన్య సభ్యులు అధ్యాపకులు విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు.

