ఫ్రూట్ జ్యూస్‌లో పురుగులు..!

ఆరోగ్యం క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ఫ్రూట్ జ్యూస్‌లో పురుగులు..!
– కొనుగోలు దారుడి గుర్తింపు రట్టు
– అధికారుల తనిఖీలో కుళ్లిన పండ్లు స్వాదీనం
– తాండూరులో జ్యూస్ సెంటర్‌ సీజ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆశపడి కొనుగోలు చేసిన ఫ్రూట్‌ జ్యూస్‌లో పురుగులు దర్శనమిచ్చాయి. వెంటనే కొనుగోలు దారుడు తయారి వ్యాపారి నిలదీయడంతో కల్తీ విక్రయాల గుట్టు రట్టయ్యింది. అధికారులకు సమాచారం అంది తనిఖీలు చేయడంతో కుళ్లిన పండ్లు లభ్యమయ్యాయి. విక్రయాలకు పాల్పడుతున్న జ్యూస్ సెంటర్‌ను సీజ్ చేశారు. ఈ సంఘటన శుక్రవారం తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… తాండూరు పట్టణం ఇందిరా చౌరస్తా సమీపంలో ఓ వ్యాపారి మిలాప్ జ్యూస్ సెంటర్ పేరుతో వ్యాపారం చేస్తున్నారు.

అయితే పట్టణంకు చెందిన ఓ వ్యక్తి తమ ఇంట్లో వారి కోసం జ్యూస్ సెంటర్‌ లో ఫ్రూట్ జ్యూస్ కొనుగోలు చేశారు. కొనే సమయంలో స్వచ్ఛమైందా లేదా అని అడిగాడు. తామూ తయారు చేసిన జ్యూస్ ఫ్రీజ్‌లో ఉంచితే మూడు రోజుల వరకు స్వచ్ఛంగా ఉంటుందని తెలిపారు. తీరా వ్యక్తి ఇంటికి వెళ్లి చూసే సరికి అందులో పురుగులు దర్శనమిచ్చాయి. వెంటనే యువకుడు జ్యూస్‌ సెంటర్‌ వచ్చి నిలదీశాడు. ఇంట్లో పిల్లలు తిని అనారోగ్యానికి గురైతే ఎవరిది బాధ్యత అంటూ ప్రశ్నించారు.

కొద్ది సేపటి తరువాత విషయం మున్సిపల్ అధికారులకు తెలియడంతో వారు జ్యూస్ సెంటర్ వద్దకు వచ్చారు. దుకాణంలో జ్యూస్‌, పండ్లను పరిశీలించగా కుల్లిపోయినట్లు గుర్తించారు. తయారు చేసిన జ్యూస్‌లు కూడా కల్తీగా మారడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే వాటిని స్వాదీనం చేసుకుని దుకాణాన్ని సీజ్ చేశారు. ఈ తనిఖీలో టీపీఎస్ అశోక్ కుమార్, సీనీయర్, జూనియర్ అసిస్టెంట్‌, జవాన్లు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

రేణుకా ఎల్లమ్మకు గాజుల ఉత్సవం