అందరికి.. ఆనందం..!
– విద్యార్థులకు దీపావళీ స్వీట్ల పంపిణి
– మార్వాడి యువమంచ్ సంప్రదాయం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే దీపావళీ పండుగలో ఉన్న ఆనందాన్ని తాండూరు మార్వాడి యువమంచ్ విద్యార్థులకు ముందుస్తుగా అందించింది. ప్రతి యేడాది మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో ఆనంద్ సబ్ కే లీయే అనే కార్యక్రమాన్ని సంప్రదాయంగా కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా శనివారం తాండూరు మండలం కరణ్ కోట్ లోని జెడ్పీ ప్రాథమిక పాఠశాలలో 150 మంది విద్యార్థులకు దీపావళీ పండగను పురస్కరించుకుని స్వీట్లను పంచి పెట్టారు. అదేవిధంగా యాలాల మండలం కోకట్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో కూడా మరో 150 మంది విద్యార్థులకు స్వీటు బాక్సులను పంపిణీ చేశారు. పండగ సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపి.. వారితో ఆనందాన్ని పెంచుకున్నారు.
ఈ సందర్భంగా మార్వాడి యువమంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సార్ధా మాట్లాడుతూ పేదలకు, విద్యార్థులకు సేవలు అందించడంతో మార్వాడి యువమంచ్ ముందు ఉంటుందన్నారు. వారి సేవల కోసం మంచ్ సభ్యులు సంపాదించే ఆధాయంలో కొంత కేటాయిస్తుందని అన్నారు. నేను బాగుండాలి- నాతో అందరు బాగుండాలని మార్వాడి యువమంచ్ పనిచేస్తుందని అన్నారు. ఇందులో భాగంగా ఆనంద్ సబ్ కే లీయే సంప్రదాయాన్ని కొనసాగించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మంచ్ అధ్యక్షులు అనిల్ సార్ధా, కార్యదర్శి సచిన్ రాఠి, కోశాధికారి అరుణ్ సార్డా, రోహిత్ అగ్రవాల్, ఆశిష్ సార్థా, పాఠశాల హెచ్ఎం మహిపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి, అనంత నర్సింహా, రజిత, నెహ్రు చవాన్, షఫీ, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

