మహా నిమజ్జనంకు పటిష్ట చర్యలు

తాండూరు రాజకీయం వికారాబాద్

మహా నిమజ్జనంకు పటిష్ట చర్యలు
– శోభాయాత్రలో భారీ బందోబస్తు
– రంగంలోకి ప్రత్యేక బృందాలు
– తాండూర్ డిఎస్పి బాలకృష్ణారెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో బుధవారం నిర్వహించే గణేష్‌ మహా నిమజ్జనంకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి యేడాది మాదిరిగానే ఈసారి జరిగే వినాయక మహా నిమజ్జనంలో పోలీసు శాఖ తరుపున చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. శోభాయాత్రలో సుమారు 370 మంది అధికారులు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

అందులో ప్రత్యేక బృందాలు, బలగాలు పాల్గొంటాయని వివరించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటకు జరగకుండా నిరంతరం నిఘా వ్యవస్థ దృష్టిసారిస్తుందన్నారు. వినాయక మండపాల నిర్వహకులు వినాయకులను నిమజ్జనానికి త్వరగా తరలించాలని సూచించారు. ఎలాంటి గొడవలకు పోకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జన వేడుకలు పూర్తిచేశాలా ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరించాలని కోరారు.

ఇదికూడా చదవండి…

వినాయకుని కృప అందరికి సిద్దించాలి