ఘనంగా ప్రజా పాలన దినోత్సవం

తాండూరు రాజకీయం వికారాబాద్

ఘనంగా ప్రజా పాలన దినోత్సవం
– జెండా ఆవిష్కరించిన సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్
– క్యాంపు కార్యాలయంలో జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, మున్సిపల్ తదితర శాఖల కార్యాలయాలలో ప్రజా పాలన దినోత్సవం నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాయలంలో సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, నేతలు పాల్గొన్నారు.

అదేవిధంగా తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జాతీయజెండాను ఎగురవేశారు. జాతీయ గీతంతో అందరు వందనం సమర్పించారు. మరోవైపు మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, నాయకులు కరణం పురుషోత్తం రావు, అబ్దుల్ రవూఫ్, మాజీ జెడ్పీటీసీ ధారాసింగ్, ఉత్తమ్ చంద్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, విజయ దేవి, ప్రభాకర్ గౌడ్, బోయరవి. మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కావలి సంతోష్ కుమార్ యువనాయకులు, నేతలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

హస్బెండ్‌కు ఫుల్ ఫ్రీడమ్..!