వైభవంగా వాల్మీకీ జయంతి..!
– దేవాలయంలో ప్రత్యేక పూజలు
– పాల్గొన్న వాల్మీకి సోదరులు, నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని మహర్షి వాల్మీకీ దేవాలయం జయ జయ ద్వానాలతో మార్మోగింది. మంగళవారం తాండూరులో బోయ వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు.

పట్టణంలోని వాల్మీకినగర్లో ప్రతిష్టించిన వాల్మీకి దేవాలయంలో మహర్షికి ప్రత్యేక అలంకరణతో పాటు ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించారు. సంఘం సభ్యులు, వాల్మీకీ సోదరులు పెద్ద ఎత్తున తరలివచ్చి వాల్మీకీ మహర్షిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పలువురు నాయకులు దేవాలయాన్ని సందర్శించి వాల్మీకీ మహర్షికి పూజలు నిర్వహించారు. అదేవిధంగా వాల్మీకీ జయంతి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఐక్య బోయ వాల్మీకీ సంఘం నాయకులు, సంఘం ప్రతినిధులు, పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

