సింధులో.. పూల జాతర..!
– అట్టహాసంగా బతుకమ్మ సంబరాలు
– పాల్గొన్న ఆర్బీఓఎల్ ఎండీ సరళ రెడ్డి
– విద్యార్థులతో ఆడిన డైరెక్టర్, ప్రిన్సిపల్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని సింధు డిగ్రీ కాలేజీ ప్రాంగణం పూల జాతరను తలపించింది. శనివారం కళాశాల ఆధ్వర్యంలో తెలంగాణ పండగ బతుకమ్మ సంబరాలున అట్టహాసంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు కాంగ్రెస్ నాయకురాలు, ఆర్బీఓఎల్ ఎండీ బుయ్యని సరళా శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. వేడుకల సందర్భంగా విద్యార్థులకు రంగురంగుల పూలతో బతుకమ్మను అలంకరించి తీసుకవచ్చారు.

ముఖ్య అతిథి సరళా శ్రీనివాస్ రెడ్డి, కళాశాల డైరెక్టర్లు సింధూ, రాధిక సృజన్, ఫౌండర్ వి.రంగారావు, ప్రిన్సిపల్ వి జయదేవిలు బతుకమ్మకు పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులు బతుకమ్మల చుట్టూ ఆడిపాడారు. చిత్తు చిత్తూల బొమ్మ, తెలంగాణలో పుట్టి.. పూల పల్లకి ఎక్కీ.. అంటూ పాటలతో ఉత్సహంగా గడిపారు. కేరింతలతో, నృత్యాలతో కాలేజీ ప్రాంగణం పూల జాతరగా మారింది.

అనంతరం పలువురు మాట్లాడుతూ బతుకమ్మ పండగ తెలంగాణ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. పూలకు పూజ చేసే మన సంస్కృతి ఎక్కడా లేదని, దానిని కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సింధూ బాలికల జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ సంగీత, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

