వైద్య సేవలపై నమ్మకం పెంచాలి
– అందరికి మెరుగైన వైద్య సేవలందించాలి
– దవఖానా అభివృద్దికి తోడ్పాటు
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– ఎంసీహెచ్ ఆసుపత్రిలో ఎమ్మెల్యే సమీక్షా
తాండూరు, దర్శిని ప్రతినిధి : సర్కారు దవఖానలో అందే సేవలపై పేదలకు నమ్మకం పెంచేలా పనిచేయాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుపత్రి(ఎంసీహెచ్)ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సందర్శించారు. ఆసుపత్రిలోని మహిళలు, చిన్నారులకు సంబంధించిన వార్డులను పరిశీలించారు. వార్డులలో చికిత్స పొందుతున్న రోగులను, బందువులను వైద్య సేవలు ఎలా అందిస్తున్నారని ఆరా తీశారు. ఆసుపత్రిలోని మందుల గది, ల్యాబ్, ఆపరేషన్ థియేటర్ వంటి విభాగాలను పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి సూపరిండెంట్ డా. రవిశంకర్ ఆధ్వర్యంలో వైద్య అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఆసుపత్రికి అవసరమైన పనులు, వసతులను సూపరిండెంట్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో భద్రత విషయంలో పోలీసు సిబ్బందిని కేటాయించేలా చూడాలని కోరారు. ఆసుపత్రి వద్ద బస్సులు నిలిపేలా చూడాలని కోరారు. ఇందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్పందించారు. భద్రత విషయంపై జిల్లా ఎస్పీతో మాట్లాడారు. అదేవిధంగా ఆసుపత్రి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని అన్నారు. సౌకర్యాలు, వసతులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
అదేవిధంగా జిల్లా ఆసుపత్రికి మూడో సారి కాయకల్ప అవార్డు రావడం పట్ల వైద్యులను అభినందించారు. ఇదే స్పూర్తితో సర్కారు దవాఖానా వైద్య సేవలపై ప్రజల్లో నమ్మకం పెంచేలా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, రాము, మాజీ జడ్పీటిసి థారసింగ్, అబ్దుల్ రవూఫ్, మసూద్, డీహెచ్ఓ ప్రదీప్ కుమార్, ఆర్ఎంఓ డాక్టర్ అనిల్ కుమార్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

