ఎద్దుపై పంజా..!
– విచిత్ర గాయంతో మృతి
– చిరుతపులి దాడి అంటూ అనుమానం
– పొలంలో పులి అడుగుల కలకలం
తాండూరు, దర్శిని ప్రతినిధి : పొలం వద్ద కట్టేసి ఉన్న ఎద్దుపై దాడి జరిగింది. ఈ దాడిలో ఎద్దు అక్కడిక్కడే మృతి చెందింది. అయితే ఎద్దుపై చోటు చేసుకున్న గాయం చిరుత పులి జంతువుది అయి ఉంటుందని, పొలంలో కూడా పులి అడుగులు కనిపించడం కలకలం రేపుతోంది. ఈ సంఘటన యాలాల మండలం రేళ్లగడ్డ తాండాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… తాండాకు చెందిన మూడవత్ గోప్యా నాయక్ తన ఎద్దులు, ఆవులను ఊరిబయట ఉన్న పొలం వద్ద రోజు మాదిరిగానే కట్టేసి వెళ్లిపోయారు.
బుధవారం ఉదయం వచ్చి చూసే సరికి ఓ ఎద్దు గాయాలతో మృతి చెందింది. గాయంపై క్రూర జంతువు దాడి చేసినట్లు గాయాలు ఉన్నట్లు గుర్తించారు. దీనికి తోడూ పొలంలో పులి, లేదా హైనా జంతువు అడుగులు కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సంబంధిత శాఖ అధికారులు, ప్రభుత్వం ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకుని రక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఎద్దు మృతిపై కుటుంబ సభ్యులు రోధించారు. తమను ఆదుకోవాలని కోరారు.
ఇదికూడా చదవండి…


